తిరుమలకు చేరుకున్న సీజేఐ

శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీ కృష్ణ అతిథిగృహం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం

Updated : 19 Aug 2022 06:34 IST

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీ కృష్ణ అతిథిగృహం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ కూడా ఉన్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకోనున్నారు.

పునర్‌ ముద్రితమైన ‘సత్యశోధన’ పుస్తకాన్ని ఉదయం 11.30 గంటలకు సీజేఐ ఆవిష్కరించనున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 5వేల పుస్తకాలను యువతకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.


తిరుపతిలో రాస్‌ మునిరత్నం విగ్రహావిష్కరణ నేడు

తిరుపతి(గ్రామీణ), న్యూస్‌టుడే: రాష్ట్రీయ సేవా సమితి (రాస్‌) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దివంగత గుత్తా మునిరత్నం విగ్రహాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవిష్కరించనున్నారు.ఇక్కడి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని రాస్‌ కార్యాలయంలో ఉదయం పదింటికి కార్యక్రమం ఉంటుందని రాస్‌ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు