12నుంచి మహా పాదయాత్ర-2.0

అమరావతి ఉద్యమం ప్రారంభించి వచ్చే నెల 12 నాటికి 1,000 రోజులవుతున్న సందర్భంగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వరకు మరో మహా పాదయాత్ర చేపడుతున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. ఆరు

Published : 19 Aug 2022 04:18 IST

6 జిల్లాల మీదుగా  65 రోజుల పాటు యాత్ర  
అమరావతి పరిరక్షణ సమితి,  రాజధాని ఐకాస వెల్లడి  

ఈనాడు - అమరావతి: అమరావతి ఉద్యమం ప్రారంభించి వచ్చే నెల 12 నాటికి 1,000 రోజులవుతున్న సందర్భంగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వరకు మరో మహా పాదయాత్ర చేపడుతున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. ఆరు జిల్లాల గుండా 65 రోజుల పాటు ఇది సాగుతుందని ప్రకటించింది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐకాస నేతలు గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను త్వరలో ఖరారు చేస్తామని, దీనిని డీజీపీ కార్యాలయంలో సమర్పించి అనుమతి కోరతామని చెప్పారు. ప్రభుత్వ స్పందనను బట్టి హైకోర్టును ఆశ్రయించాలో లేదో నిర్ణయిస్తామని వివరించారు.  

క్యూఆర్‌ కోడ్‌తో రిజిస్ట్రేషన్లు

మహాపాదయాత్రకు అమరావతి పరిరక్షణ సమితి సాంకేతికంగా సిద్ధమవుతోంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తీసుకొస్తోంది. ఈ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేస్తే.. ఐకాస వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్‌ ఫారంలో వివరాలను నింపాల్సి ఉంటుంది. ఎప్పుడు, ఎన్నిరోజులు పాదయాత్రలో పాల్గొంటారన్న వివరం నమోదు చేస్తే దీని ఆధారంగా ఐకాస ప్రతినిధులు సంప్రదించి ఆయా రోజుల్లో వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts