వారికి పోలీసు అధికారాలు ఉండవు

‘గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసు అంటారు. కానీ, వారు పోలీసు విధులు నిర్వహించరు. వారికి సాధారణ పోలీసుల అధికారాలు ఉండవు. పేరుకే వారు మహిళా పోలీసులు.

Published : 19 Aug 2022 04:18 IST

మహిళా సంరక్షణ కార్యదర్శులపై హైకోర్టుకు ఏజీ నివేదిక

ఈనాడు, అమరావతి: ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసు అంటారు. కానీ, వారు పోలీసు విధులు నిర్వహించరు. వారికి సాధారణ పోలీసుల అధికారాలు ఉండవు. పేరుకే వారు మహిళా పోలీసులు. సంబంధిత శాఖలో వారిని అంతర్భాగం చేస్తూ చట్టం తీసుకురాబోతున్నాం. పూర్తి వివరాలను అందించేందుకు 4వారాలు ఇవ్వండి’ అని ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను సెప్టెంబరు 15కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ విశాఖకు చెందిన ఉమామహేశ్వరావు హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే జీవోలను సవాల్‌ చేస్తూ మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పనిచేస్తున్న పలువురు వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వై.బాలాజీ, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ... ‘ఒకవైపు పోలీసు విధులు అప్పగించడం లేదని చెబుతూనే... మరోవైపు పోలీసుల తరహాలో బందోబస్తు పనులు అప్పగిస్తున్నారు’ అన్నారు. దాంతో.. బందోబస్తు విధులు ఎందుకు అప్పగిస్తున్నారని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం చట్టం చేయకుండా తాము అడ్డుకోలేమని, చట్టం తెచ్చాక హైకోర్టులో సవాలు చేసే వెసులుబాటు పిటిషనర్లకు ఉందని తెలిపింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts