Published : 19 Aug 2022 04:18 IST

తాత్కాలికంగా ‘మాస్‌ లీవ్‌’ వాయిదా

ఎన్‌హెచ్‌ఎం జేఏసీ వెల్లడి

ఈనాడు, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు ఈ నెల 22న తలపెట్టిన ‘మాస్‌ లీవ్‌’ నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అపరిష్కృత డిమాండ్ల సాధనకు ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నేతలు మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌, సీనియర్‌ అధికారులు గణపతిరావు, సురేష్‌కుమార్‌లతో జేఏసీ నేతలు మలివిడత చర్చలు జరిపారు. ‘2018 నుంచి ఇప్పటివరకు నష్టపోయిన 23% శాతం వేతనం ఇస్తాం. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, రెండో ఎ.ఎన్‌.ఎం., ల్యాబ్‌ టెక్నిషియన్‌, ఫార్మసిస్టులకు కనీస వేతనం చెల్లింపు జరిగేలా చూస్తాం. ప్రతి ఏడాది వేతనం 5% పెంచుతాం. 35 క్యాజువల్‌ లీవుల విధానాన్ని పునరుద్ధరిస్తాం. జనరల్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కల్పిస్తాం. నేషనల్‌ పెన్షన్‌ స్కీము అమలుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా జరిగేలా చర్యలు ప్రయత్నిస్తాం...’ అని అధికారులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు వివరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని