‘సాదాబైనామా’ సమస్యలపై దరఖాస్తుకు 2023 చివరి వరకు గడువు పొడిగింపు

సాదా బైనామాలతో జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ గురువారం

Published : 19 Aug 2022 04:18 IST

ఈనాడు, అమరావతి: సాదా బైనామాలతో జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ గురువారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. తెల్లకాగితాలపై 01.11.2021కి ముందు (ఆన్‌ రిజిస్టర్డ్‌ స్టాంపు పేపర్లు)జరిగిన భూలావాదేవీలపై తగిన ఆధారాలతో 2023 డిసెంబర్‌ 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. గ్రామాల్లో రీ-సర్వే జరుగుతుండగా సాదా బైనామా భూములకు సంబంధించి పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిపై యాజమాన్య హక్కుల మాటేమిటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ భూముల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూశాఖ ఈ ప్రకటనను జారీ చేసింది. ఇంతకు ముందు 2000 డిసెంబర్‌ 31కి ముందు జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించి మాత్రమే దరఖాస్తుల స్వీకరణ జరిగింది. తాజా నోటిఫికేషన్‌లో 2021 ముందు వరకూ జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. దీంతో రైతులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రకటనలో పేర్కొన్న అంశాలపై 12రోజుల్లోగా అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని