వీపున పుస్తకాలు.. చేతిలో చెప్పులు

విద్యాకానుక పథకంలో ఇచ్చిన బూట్లు వేసుకునే భాగ్యం ఎప్పుడొస్తుందోనని తూర్పుగోదారి జిల్లా వెదుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ బడికి వెళ్లే రాజమహేంద్రవరం-సీతానగరం ప్రధాన

Published : 19 Aug 2022 04:18 IST

న్యూస్‌టుడే, సీతానగరం: విద్యాకానుక పథకంలో ఇచ్చిన బూట్లు వేసుకునే భాగ్యం ఎప్పుడొస్తుందోనని తూర్పుగోదారి జిల్లా వెదుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ బడికి వెళ్లే రాజమహేంద్రవరం-సీతానగరం ప్రధాన రహదారిని విస్తరణ పనుల్లో భాగంగా తవ్వేశారు. వర్షాలకు ఆ దారంతా బురదమయంగా మారింది. బూట్లు ఇచ్చినప్పటి నుంచి ఆ రోడ్డులో బురద లేని రోజు లేదు. కాలు పెడితే చాలు దిగబడిపోతోంది. దాంట్లో బూట్లతో నడవలేక విద్యార్థులు చెప్పులతోనే బడికి వస్తున్నారు. అదీనూ బురద ఎక్కువ ఉన్న చోట్ల చెప్పులనూ చేతపట్టుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరగా పూర్తయ్యేలా చేస్తే బురద తిప్పలు తప్పుతాయని విద్యార్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని