సచివాలయాలకు రూ.20 లక్షల వరకు నిధులు

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమ అమలులో భాగంగా.. అధిక ప్రభావం చూపే సమస్యలను గుర్తించి పనులను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పనుల గుర్తింపు, మంజూరు, అమలు, పర్యవేక్షణకు స్థానిక శాసనసభ్యుల

Published : 19 Aug 2022 04:19 IST

ఎమ్మెల్యే నేతృత్వంలో కమిటీ
‘గడప గడపకు’పై మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమ అమలులో భాగంగా.. అధిక ప్రభావం చూపే సమస్యలను గుర్తించి పనులను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పనుల గుర్తింపు, మంజూరు, అమలు, పర్యవేక్షణకు స్థానిక శాసనసభ్యుల నేతృత్వంలో మండల పరిషత్తు అభివృద్ధి అధికారి/పురపాలక కమిషనర్‌ను నోడల్‌ అధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సందర్భంగా కనీస వసతులు, మౌలిక సౌకర్యాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయి. వాటి  పరిష్కారానికి ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా తాగునీటి సరఫరా, రహదారులు, కాల్వలు, విద్యుత్తు, కల్వర్టులు, ఇతర సివిల్‌ పనులను గుర్తించాలి. ఒక్కో పని విలువ కనిష్ఠంగా రూ.లక్ష, గరిష్ఠంగా రూ.20 లక్షలు మించకూడదు. గుర్తించిన పనులను తీర్మాన పత్రం, అంచనా పత్రం, ప్రస్తుత ఫొటోలను గ్రీవెన్స్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మొత్తం ప్రక్రియను గ్రామ/వార్డు సచివాలయాలశాఖ పర్యవేక్షిస్తుంది’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు