పలాసలో అర్ధరాత్రి ఆందోళన

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలిక పరిధిలోని శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.  చెరువు గర్భంలో అక్రమంగా నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు

Updated : 19 Aug 2022 11:55 IST

ఉద్రిక్తంగా మారిన ఆక్రమణల తొలగింపు
తెదేపా, వైకాపా నాయకుల  మధ్య ఘర్షణ వాతావరణం
ఎమ్మెల్యే అశోక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పలాస, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలిక పరిధిలోని శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.  చెరువు గర్భంలో అక్రమంగా నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు అక్కడికి చేరుకోగా ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని. తమ నివాసాలు ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధం కావడంతో ఆ పార్టీ నాయకులు, స్థానికులు చేరుకుని ఆందోళనకు చేశారు. అధికారులను ముందుకు కదలనీయకుండా అక్కడే బైఠాయించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ చేరుకున్నారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అధికారుల తీరును దుయ్యబట్టారు. ఇంతలో వైకాపా నాయకులు అక్కడకి చేరుకోవటంతో ఇరు పార్టీల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంటి గంట సమయంలో ఎమ్మెల్యే అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు