బాల్యవివాహాలు జరగకుండా చూడాలి

బాలల హక్కుల పరిరక్షణలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది భాగస్వాములు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు. బాల్యవివాహాలు జరగకుండా, బడి ఈడు పిల్లలు

Published : 19 Aug 2022 05:15 IST

బాలల హక్కుల పరిరక్షణలో సచివాలయాల  సిబ్బంది భాగస్వాములవ్వాలి
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ  కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బాలల హక్కుల పరిరక్షణలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది భాగస్వాములు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు. బాల్యవివాహాలు జరగకుండా, బడి ఈడు పిల్లలు చదువుకునేలా చూడాలని తెలిపారు. మంగళగిరిలోని కమిషన్‌ కార్యాలయంలో అధికారులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్సు కమిటీలను బలోపేతం చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు రాజేంద్రప్రసాద్‌, ఆదిలక్ష్మి, పద్మావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని