Published : 19 Aug 2022 05:15 IST

ఇంజినీరింగ్‌ కళాశాలలకు న్యాక్‌ గుర్తింపు తప్పనిసరి

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు వచ్చే మూడేళ్లలో న్యాక్‌ గుర్తింపు తప్పనిసరిగా పొందాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2021 నుంచి న్యాక్‌-ఎ గ్రేడ్‌ సాధించిన 34 కళాశాలలకు అవార్డులు ప్రదానం చేసేంద]ుకు విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘నాణ్యత పెంపొందించేందుకు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలను పరిశీలించి గ్రేడింగ్‌ ఇవ్వాలని నిర్ణయించాం. దీనివల్ల భవిష్యత్తులో న్యాక్‌ గుర్తింపు సాధించడం సులువవుతుంది’ అని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (నాణ్యత ప్రమాణాల విభాగం) డైరెక్టర్‌ రామమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పురస్కారాలు

విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రతిపాదించిన పురస్కారాలకు వివిధ కళాశాలల నుంచి 442 ప్రతిపాదనలు అందాయి. వీటిలో ఇన్నోవేటివ్‌ స్టార్టప్‌ ప్రొటోటైప్‌ విభాగంలో విశాఖలోని జీవీపీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు చెందిన విద్యార్థి వెంకట మహేష్‌ సుబ్రహ్మణ్యానికి రూ.లక్ష అందించారు. ఐడెంటిఫికేషన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి చైతన్యకుమార్‌కు రూ.50 వేల పురస్కారం ఇచ్చారు. స్టూడెంట్‌ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా కేటగిరిలో వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి జ్యోతిర్మయికి రూ.25 వేల పురస్కారం అందజేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని