ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సలహా మండలి సభ్యుడిగా విజయ్‌కుమార్‌

ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన జాతీయ సలహా మండలిలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్‌ టి.విజయకుమార్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర

Published : 19 Aug 2022 05:15 IST

ఈనాడు-అమరావతి: ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన జాతీయ సలహా మండలిలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్‌ టి.విజయకుమార్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖలో ప్రకృతి వ్యవసాయాన్ని పర్యవేక్షించే డైరెక్టర్‌ స్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా మొత్తం 14 మంది సభ్యులతో ఈ మండలి ఏర్పాటైంది. రెండేళ్లపాటు కొనసాగే ఈ మండలి.. తొలుత గంగా పరివాహక పరిధిలో అయిదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుందని రైతు సాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని