Published : 19 Aug 2022 05:15 IST

ఉన్నత విద్యా రంగంపై గోవా ప్రతినిధుల అధ్యయనం

ఈనాడు-అమరావతి: ఉన్నత విద్యా రంగంలో రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను గోవా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం గురువారం అధ్యయనం చేసింది. జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, పునర్నిర్మాణం, సాధారణ ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ తదితర అంశాలను పరిశీలించింది. ఎన్‌ఏఏసీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌, ఎన్‌బీఏ ర్యాంకులు సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో కూడా బృందం తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీతో కలిసి అమలు చేస్తున్న పరిశోధన కార్యక్రమాలు, డిగ్రీలో పది నెలలపాటు విధిగా ఇంటర్న్‌షిప్‌ అమలును గోవా ప్రతినిధుల బృందానికి వివరించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఉన్నత విద్యా రంగంలో 86% విద్యార్థులకు లబ్ధి చేకూరడాన్ని గోవా బృందం ప్రశంసించిందని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారని పేర్కొన్నారు. గోవా ప్రతినిధుల బృందంలో ఆచార్య నియాన్‌ మార్కోన్‌, ఎఫ్‌ఎం నదాఫ్‌, వందనా నాయక్‌, సందేశ్‌ గాంకర్‌, సిద్ధి బండాంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని