Published : 19 Aug 2022 06:33 IST

ఆర్య వైశ్య ర్యాంకర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన ఆర్య వైశ్య విద్యార్థులను అవోపా బ్యాంక్‌మెన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో బంగారు పతకాలతో సన్మానించనున్నట్లు చాప్టర్‌ అధ్యక్షుడు పి.వి.రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జేఈఈ, ఎంసెట్‌, నీట్‌, ఈసెట్‌లలో మొదటి వెయ్యి లోపు ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వైశ్య విద్యార్థులు పూర్తి వివరాలు, మొబైల్‌ నంబరు, హాల్‌టికెట్‌ నంబర్లు, ర్యాంకు కార్డు నకళ్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ప్రాజెక్టు కన్వీనర్‌ కొత్త రామానందం, 2-2-16(బి.సి.) ఆర్మాన్‌ టవర్స్‌, వీధి నం.1, డీడీ కాలనీ, హైదరాబాద్‌ చిరునామాకు ఈ నెల 30లోపు స్వయంగా లేదా పోస్టులో పంపవచ్చని పేర్కొన్నారు. సెప్టెంబరు 11న కాచిగూడలోని ఆర్య వైశ్య హాస్టల్‌లో విద్యార్థులను సత్కరించనున్నామని, వివరాలకు 9290529133 నంబరులో సంప్రదించాలన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని