Narsipatnam: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి!.. తల్లి కోరికను తీర్చిన తనయుడు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎం.గౌరీపార్వతి యుక్త వయసులో ప్రేమించిన వ్యక్తితో రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. 56ఏళ్ల కిందట పుట్టింటి వారికి దూరంగా వెళ్లిన ఆమె వయసు ఇప్పుడు 72ఏళ్లు. తన వాళ్లందరినీ
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎం.గౌరీపార్వతి యుక్త వయసులో ప్రేమించిన వ్యక్తితో రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. 56ఏళ్ల కిందట పుట్టింటి వారికి దూరంగా వెళ్లిన ఆమె వయసు ఇప్పుడు 72ఏళ్లు. తన వాళ్లందరినీ చూడాలని ఉందని కుమారుడు షణ్ముక్‌రాజ్‌తో కొన్నాళ్ల క్రితం చెప్పారామె. తల్లి కోరిక తీర్చేందుకు ఇటీవల నర్సీపట్నం వచ్చిన అతడు బంధువులను కలిశారు. తన వాళ్ల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో వివరించారు. దీంతో పుట్టింటి వారంతా తమిళనాడు వెళ్లి గౌరీపార్వతిని చూసి వచ్చారు. 4 రోజుల కిందట గౌరీపార్వతి తన కుటుంబంతో కలిసి నర్సీపట్నంలోని పుట్టింటికి వచ్చారు. ఆమె రాకను బంధుమిత్రులంతా ఆనందంతో స్వాగతించారు. చిన్ననాటి ముచ్చట్ల నుంచి ఇన్నేళ్ల అనుభవాలను పంచుకుంటున్నారు. తమిళనాడులోని ఎట్టాయపురం ప్రాంతానికి చెందిన నమ్మళ్వార్ ఆరు దశాబ్దాల కిందట నర్సీపట్నం ప్రాంతానికి విద్యుత్తు పనుల కోసం రాగా.. గౌరీపార్వతి పరిచయమై ప్రేమగా మారింది. వీరి వివాహానికి అప్పట్లో కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తమిళనాడు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్