ఎన్‌ఎస్‌ఐసీ- ఏపీమెడ్‌టెక్‌ మధ్య ఒప్పందం

వైద్య పరికరాల ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ), ఏపీ మెడ్‌టెక్‌ జోన్లు నిర్ణయించాయి.

Published : 23 Sep 2022 04:08 IST

ఈనాడు, దిల్లీ: వైద్య పరికరాల ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ), ఏపీ మెడ్‌టెక్‌ జోన్లు నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్‌ రాణే సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా రాణే మాట్లాడుతూ.. వైద్య పరికరాల ఉత్పత్తిలో ఎంఎస్‌ఎంఈలు సత్తా చాటుకోవడానికి ఈ ఒప్పందం ఓ ముందడుగులాంటిదని పేర్కొన్నారు. వైద్య పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎంఓయూపై ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ గౌరంగ్‌ దీక్షిత్‌, ఏపీమెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ, సీఈఓ జితేంద్రశర్మలు సంతకాలు చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts