కృష్ణా బోర్డును విశాఖకు తరలించండి

కృష్ణాబోర్డును హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తాజాగా లేఖ రాసింది. విశాఖలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో ఏడు వేల చదరపు అడుగుల

Published : 23 Sep 2022 04:08 IST

కార్యాలయ ఏర్పాటుకు వసతులు ఉన్నాయంటూ ఏపీ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణాబోర్డును హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తాజాగా లేఖ రాసింది. విశాఖలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో ఏడు వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని, బోర్డు కార్యాలయ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే, కృష్ణాబోర్డు అధికారులు గతంలో విశాఖను సందర్శించి దాదాపు పదివేలకు పైగా చదరపు అడుగుల స్థలం కావాలని ప్రతిపాదన సమర్పించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని