ఆదాయపు పన్ను మినహాయించాల్సిందే!

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల స్థూల వేతనం ఎవరికైతే రూ.50 వేలు ఉంటుందో వారందరి జీతాల నుంచి సెప్టెంబరు నెలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయించాలని ఆర్థికశాఖ మెమో ఇచ్చింది. ఒక వేళ ఇప్పటికే ఉప ఖజానా

Updated : 23 Sep 2022 05:24 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల స్థూల వేతనం ఎవరికైతే రూ.50 వేలు ఉంటుందో వారందరి జీతాల నుంచి సెప్టెంబరు నెలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయించాలని ఆర్థికశాఖ మెమో ఇచ్చింది. ఒక వేళ ఇప్పటికే ఉప ఖజానా అధికారులకు జీతాల బిల్లులు వచ్చినట్లయితే వాటిని తిరిగి డ్రాయింగ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారులకు పంపి ఈ మినహాయింపు జరిగేలా చూడాలని ఆదేశించింది. సాధారణంగా ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం చివర్లో మూడు నెలలు తమ ఆదాయపు పన్నును మినహాయించుకుని జీతాల బిల్లులు సమర్పిస్తుంటారు. ఆదాయపు పన్ను శాఖ ఆదేశాల ప్రకారం మొత్తం ఏడాదికి ఆదాయాన్ని, వారి రాయితీలను పరిగణనలోకి తీసుకుని ఎంత ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందో ఆ మొత్తం సమానంగా ప్రతి నెల జీతం నుంచి మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో సెప్టెంబరు నెల నుంచి అది అమలు చేయాలని ఆర్థికశాఖ ఖజానా అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని