263 అద్దె బస్సుల కోసం టెండర్లు

ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టేందుకు.. అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుంటే పూర్తిస్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఇప్పటి దాకా రెండు దఫాలుగా టెండర్లు పిలిచిన

Updated : 23 Sep 2022 05:23 IST

వరుసగా మూడోసారి

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టేందుకు.. అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుంటే పూర్తిస్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఇప్పటి దాకా రెండు దఫాలుగా టెండర్లు పిలిచిన అధికారులు, తాజాగా మూడోసారి 263 బస్సులకు టెండర్లు ఆహ్వానించారు. 998 అద్దె బస్సుల కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి కేంద్ర సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు పిలిచారు. స్పందన లేకపోవడంతో రెండోసారి ఆహ్వానించారు. రెండు దఫాల్లో 735 రూట్లలో బస్సులను ఖరారు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 400 బస్సులే వచ్చాయి. తాజాగా 4 ఏసీ స్లీపర్‌, 6 నాన్‌ ఏసీ స్లీపర్‌, 12 సూపర్‌లగ్జరీ, 15 అల్ట్రా డీలక్స్‌, 30 ఎక్స్‌ప్రెస్‌, 95 అల్ట్రా పల్లెవెలుగు, 72 పల్లెవెలుగు, 27 మెట్రో ఎక్స్‌ప్రెస్‌, 2 సిటీ ఆర్డినరీ సర్వీసులు కావాలంటూ టెండర్లు ఆహ్వానించారు. ఆర్టీసీ విధించిన పలు కఠిన నిబంధనల కారణంగా ఎక్కువ మంది బిడ్లు వేసేందుకు ముందుకు రావడం లేదని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. గత టెండర్లలో ఆర్టీసీ అధికారులు అంచనా వేసిన ధర కంటే కి.మీ.కు తక్కువ కోట్‌ చేసి, ఎంపికైన వారూ బస్సుల్ని అందుబాటులోకి తేవడంపై వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. టెండర్లలో ఒక్కో బస్సుకు రూ.50 వేలు చొప్పున చెల్లించిన నాన్‌ రిఫండబుల్‌ మొత్తాన్నీ వదులుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు