ఆర్‌ఎంసీ సమావేశం మళ్లీ వాయిదా

కృష్ణా నదీ యాజమాన్యబోర్డు రిజర్వాయర్‌ మేనేజిమెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ-జలాశయాల నిర్వహణ కమిటీ) ఐదో సమావేశం మళ్లీ వాయిదా పడింది. సెప్టెంబరు 27న ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశానికి హాజరు

Updated : 23 Sep 2022 05:21 IST

అక్టోబరు 17న తదుపరి భేటీ

ఈనాడు, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్యబోర్డు రిజర్వాయర్‌ మేనేజిమెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ-జలాశయాల నిర్వహణ కమిటీ) ఐదో సమావేశం మళ్లీ వాయిదా పడింది. సెప్టెంబరు 27న ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల మేరకు 27 నాటి సమావేశానికి రాలేమంటూ ఆయన నుంచి కృష్ణా బోర్డుకు లేఖ అందింది. దీంతో ఈ సమావేశాన్ని అక్టోబరు 17 నాటికి వాయిదా వేస్తున్నట్లు కేఆర్‌ఎంబీ సూపరింటెండెంట్‌ ఇంజినీరు రెండు రాష్ట్రాలకు వర్తమానం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు