ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో 82 శాతం సీట్లు భర్తీ

ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌ సీట్లు 81.57శాతం భర్తీ అయ్యాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఫలితాలను కన్వీనర్‌ నాగరాణి గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 248 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1,11,864 సీట్లు ఉండగా.

Published : 23 Sep 2022 05:19 IST

మొదటి విడతలో 91,249 మందికి ప్రవేశాలు

ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌ సీట్లు 81.57శాతం భర్తీ అయ్యాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఫలితాలను కన్వీనర్‌ నాగరాణి గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 248 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1,11,864 సీట్లు ఉండగా.. 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయాల పరిధిలోని 25 కళాశాలల్లో 6,529 సీట్లు ఉండగా.. 5,608మంది ప్రవేశాలు పొందారు. ప్రైవేటులోని 223 కళాశాలల్లో 1,05,335 సీట్లకు 85,641 నిండాయి. ఈఏపీసెట్‌లో మొత్తం 1,73,572 అర్హత సాధించగా.. వీరిలో 1,02,133 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత 1,01,318 మంది అర్హత సాధించగా.. వీరిలో 99,025 మంది విద్యార్థులు కళాశాలలు, కోర్సులకు వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే మొదటి విడత కన్వీనర్‌ కోటాలో 10,729 ప్రవేశాలు పెరిగాయి. కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ)లో అత్యధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈ, దాని అనుబంధ కోర్సుల్లో 41,991 సీట్లు నిండాయి. ఈసీఈలో 20,211, ఈఈఈలో 6,080, మెకానికల్‌లో 3,728, సివిల్‌లో 3,385 సీట్లు భర్తీ అయ్యాయి. క్రీడా కోటాలో 492, ఎన్‌సీసీ కోటాలో 984 మంది వెబ్‌ఐచ్ఛికాలు ఇవ్వగా... ధ్రువపత్రాల పరిశీలన పూర్తికానందున వీరికి సీట్లు కేటాయించలేదు. శాప్‌ నుంచి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక సీట్లను కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని