శిక్షణ కార్యక్రమాలపై... ఏపీ శాక్స్‌, ఎకో ఇండియా ఒప్పందం

శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ(ఏపీ శాక్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని ఏపీ శాక్స్‌

Updated : 23 Sep 2022 05:22 IST

ఈనాడు, అమరావతి: శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ(ఏపీ శాక్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని ఏపీ శాక్స్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ సమక్షంలో ఏపీడీ డాక్టర్‌ కామేశ్వర్‌ప్రసాద్‌, ఎకో ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సందీప్‌ భల్లాలు ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ నోడల్‌ అధికారి డాక్టర్‌ డీవీఎస్‌ఎన్‌ శాస్త్రి, క్యాన్సర్‌ కేర్‌ నోడల్‌ అధికారి నరసింగరావు, డీఎంఈ కార్యాలయ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సుగుణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని