Updated : 23 Sep 2022 05:20 IST

పీపీలతో ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ సమావేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో (పీపీ) న్యాయశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ (ఎఫ్‌ఏసీ) జి.సత్య ప్రభాకరరావు గురువారం విజయవాడలోని కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోర్టు మానిటరింగ్‌ సిస్టం అధికారులకు, ప్రాసిక్యూటర్లకు పలు సూచనలు చేశారు. న్యాయాధికారులు, పోలీసు అధికారులను సంప్రదించి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి పాల్గొన్నారు.  ప్రాసిక్యూషన్స్‌ అదనపు డైరెక్టర్‌ బి.రామకోటేశ్వరరావు, సంయుక్త డైరెక్టర్లు అజయ్‌ ప్రేమ్‌కుమార్‌, సుబ్బలక్ష్మమ్మ సలహాలు అందించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని