ఏపీ జూడో బృందాలను జాతీయ క్రీడలకు అనుమతించండి

ఏపీ జూడో అసోసియేషన్‌ సహకారంతో ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌) వైస్‌ ఛైర్మన్‌, ఎండీ పంపే ఏపీ జూడో బృందాలను గుర్తించి వారిని గుజరాత్‌లో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న 36వ జాతీయ క్రీడలకు అనుమతించాలని గుజరాత్‌

Published : 23 Sep 2022 05:19 IST

గుజరాత్‌ క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఏపీ జూడో అసోసియేషన్‌ సహకారంతో ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌) వైస్‌ ఛైర్మన్‌, ఎండీ పంపే ఏపీ జూడో బృందాలను గుర్తించి వారిని గుజరాత్‌లో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న 36వ జాతీయ క్రీడలకు అనుమతించాలని గుజరాత్‌ క్రీడలు, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. క్రీడాకారుల ఎంపిక, 36వ జాతీయ క్రీడలకు పంపే జూడో బృందాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ ఆర్‌.కె.పురుషోత్తం, విజయవాడలోని ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ జోక్యాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులకు నోటీసులిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌.కె.పురుషోత్తానికి చెందిన సంఘాన్ని చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారని, ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసేలా ఆదేశించాలని కోరుతూ ‘ఏపీ జూడో అసోసియేషన్‌ కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని