విజయ పాల ప్యాకెట్ల ధర పెంపు

ఈనెల 26 నుంచి విజయ పాల ప్యాకెట్ల ధర పెంచాలని నిర్ణయించినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పాల

Published : 24 Sep 2022 03:57 IST

 

విజయవాడ(విద్యాధరపురం), న్యూస్‌టుడే: ఈనెల 26 నుంచి విజయ పాల ప్యాకెట్ల ధర పెంచాలని నిర్ణయించినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు చెల్లించే సేకరణ ధర, డీజిల్‌, రవాణా ఖర్చులు పెరిగినందున ధరలు సవరించినట్లు పేర్కొన్నారు. విజయ లోఫ్యాట్‌ రూ.26, ఎకానమీ రూ.28, స్పెషల్‌ రూ.34, విజయ గోల్డ్‌ రూ.35గా నిర్ణయించినట్లు తెలిపారు. పాల కార్డు కొనుగోలు చేసిన వారికి అక్టోబరు 9 వరకు పాత ధరలు వర్తిస్తాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని