సీఎం చేతుల మీదుగా 27, 28 తేదీల్లో పలు ప్రారంభోత్సవాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Published : 24 Sep 2022 04:19 IST

వచ్చే ఏడాది అందుబాటులోకి శ్రీనివాససేతు

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1ను ఆనుకుని పునర్నిర్మించిన ఉద్యానవనాన్ని ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న సీఎం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తిరుమలకు మొదటి విడతగా కేటాయించిన 50 ఎలక్ట్రిక్‌ బస్సులలో పదింటిని, తిరుపతిలోని కరకంబాడి వైపు నుంచి వాసవీ భవన్‌ వరకు నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ను 27న, తిరుమలలో కొత్తగా నిర్మించిన పరకామణి భవనాన్ని 28న ప్రారంభిస్తారని వివరించారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా శ్రీనివాససేతు పనులు పూర్తిచేసి కొత్త ఏడాదిలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అనంతరం ఛైర్మన్‌ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పార్కు పునర్నిర్మాణ దాత హైదరాబాద్‌కు చెందిన రవికుమార్‌ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

* శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులకు శుక్రవారం పది గంటలకు పైగా సమయం పట్టినట్లు తితిదే ప్రకటించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని