వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ఠ సేవలు అందించిన వ్యక్తులకు ‘వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య, వైఎస్‌ఆర్‌ సాఫల్య- 2022’ పురస్కారాలను

Published : 24 Sep 2022 05:31 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ఠ సేవలు అందించిన వ్యక్తులకు ‘వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య, వైఎస్‌ఆర్‌ సాఫల్య- 2022’ పురస్కారాలను అందించనున్నట్లు సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారాల కోసం వ్యక్తులు, సంస్థలు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘‘దరఖాస్తులను secy-political@ap.gov.in అనే మెయిల్‌కు పంపాలి. వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉన్నతస్థాయి స్క్రీనింగ్‌ కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షల నగదు, వైఎస్‌ఆర్‌ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్‌ఆర్‌ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తాం’’ అని పేర్కొన్నారు.

* రెండో ఏడాది అవార్డుల ఎంపిక విధానాలపై చర్చించడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్‌ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్‌, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి అరుణ్‌కుమార్‌, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉపకార్యదర్శి బాలసుబ్రమణ్యంరెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని