ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు ఎదుట పెద్ద సంఖ్యలో న్యాయవాదులు

Updated : 24 Sep 2022 05:49 IST

హైకోర్టు న్యాయవాదుల డిమాండ్‌

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు ఎదుట పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోహార్‌ ఎన్టీఆర్‌, అమర్‌రహే ఎన్టీఆర్‌, రక్షిస్తాం-రక్షిస్తాం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం అంటూ నినదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు కేఎం కృష్ణారెడ్డి, టీఎస్‌ రాయలు, ఎస్‌.దేవకుమార్‌, పారా కిశోర్‌, సలీంపాషా, పి.అనంద్‌శేషు, జె.కోటేశ్వరిదేవి, వీవీ లక్ష్మీనారాయణ, రజిని, విష్ణుతేజ, డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, విజయవాడ కోర్టు మాజీ పీపీ సత్యనారాయణ, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని