‘రిక్వెస్ట్‌’ బదిలీల మార్గదర్శకాల జారీ!

రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల రిక్వెస్ట్‌ బదిలీలకు మార్గదర్శకాలు శుక్రవారం వెలువడ్డాయి. ప్రజారోగ్య శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో పనిచేసే

Published : 24 Sep 2022 05:31 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల రిక్వెస్ట్‌ బదిలీలకు మార్గదర్శకాలు శుక్రవారం వెలువడ్డాయి. ప్రజారోగ్య శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో పనిచేసే వైద్యులకు సాధారణ బదిలీలు ఇంతకుముందే జరిగాయి. అయితే వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు బదిలీలు జరగలేదు. శాఖాపరంగా రీస్ట్రక్చరింగ్‌ జరుగుతుండడం, కొత్త నియామకాల కారణంగా ఉన్నతాధికారులు బదిలీలు జరపకపోవడంతో వైద్యుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మంజూరైన పోస్టులు ఉండి, వాటిల్లో ఎవరూ లేని స్థానాల్లోకి రిక్వెస్ట్‌ బదిలీల ద్వారా వైద్యులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ ఖాళీలు సుమారు 600 వరకు ఉన్నట్లు గుర్తించారు. రెగ్యులర్‌ వైద్యులు గిరిజన ప్రాంతాల్లో ఒకేచోట రెండేళ్లు, పట్టణ/గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ల నుంచి పనిచేస్తోన్న వైద్యులు రిక్వెస్ట్‌ బదిలీలకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీల నిర్వహణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటుచేస్తూ..ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

నేడు కౌన్సెలింగ్‌!
వైద్య విధాన పరిషత్‌కు చెంది..బోధనాసుపత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో పనిచేసే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు/ట్యూటర్లను (పీజీ/డిప్లొమా వైద్యులు) వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పనిచేసేందుకు వీలుగా శనివారం ‘జూమ్‌’ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

ఏలూరు జిల్లాలో తప్పులు!
ఆసుపత్రుల్లో పారా మెడికల్‌, ఇతర సిబ్బంది నియామకాలకు సంబంధించి మెరిట్‌ రూపకల్పనలో ఏలూరు జిల్లా అధికారులు తప్పులు చేశారు.  అభ్యర్థులు సాధించిన మార్కుల (సీజీపీఏ)కు ప్రాధాన్య ఫార్ములా అమలులో ఏలూరు అధికారులు తప్పులు చేయడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేయడంతో అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఆదేశించారు.   వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని