రాష్ట్రానికి 6 ‘స్వచ్ఛ’ అవార్డులు

కేంద్ర స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులకు రాష్ట్రంలోని 6 పుర, నగరపాలక సంస్థలు ఎంపికయ్యాయి. జాతీయస్థాయిలో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డు దక్కించుకుంది. నగరపాలక సంస్థల

Published : 24 Sep 2022 05:31 IST

ఈనాడు, అమరావతి: కేంద్ర స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులకు రాష్ట్రంలోని 6 పుర, నగరపాలక సంస్థలు ఎంపికయ్యాయి. జాతీయస్థాయిలో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డు దక్కించుకుంది. నగరపాలక సంస్థల విభాగంలో విజయవాడ, మహా విశాఖ నగరపాలక సంస్థ, పురపాలక విభాగంలో సాలూరు, పుంగనూరు, పులివెందులకు అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ నుంచి స్వచ్ఛాంధ్ర సంస్థకు శుక్రవారం సమాచారం అందింది. అక్టోబరు 1న దిల్లీలో అవార్డులను అందిస్తారు.  తిరుపతి నగరపాలక సంస్థకు ప్రధాని అవార్డు అందజేయనున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని