ఎన్టీఆర్.. పేరు కాదు సంస్కృతి
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి
మీరు పేరు మారిస్తే.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు
నందమూరి బాలకృష్ణ ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. ‘మార్చేయడానికి, తీసేయడానికీ ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక’ అని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు, పంచభూతాలున్నాయని హెచ్చరించారు. ‘తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు. కుమారుడు యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు.
ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు’ అంటూ ఫేస్బుక్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ తెలుగువాడి గుండెల్లో ఉన్నారంటూ గతంలో ‘ఈనాడు’లో వచ్చిన కార్టూన్‌ను ఆయన ట్వీట్‌కు జత చేశారు.
తెలుగు తల్లి కన్నీరు పెడుతోంది
- కె.రాఘవేంద్రరావు
ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగుతల్లి సిగ్గు పడుతోందని, కన్నీరు పెడుతోందని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ట్విటర్లో పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!