ట్యాబ్‌లకు 3 నెలలు ఆగాల్సిందే!

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే ట్యాబ్‌ల కోసం మరో 3 నెలలు ఎదురు చూడాల్సిందే. టెండర్ల ప్రక్రియ

Published : 25 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే ట్యాబ్‌ల కోసం మరో 3 నెలలు ఎదురు చూడాల్సిందే. టెండర్ల ప్రక్రియ పూర్తయినా ట్యాబ్‌ల కొరత కారణంగా డిసెంబరు వరకు విద్యార్థులకు అందే పరిస్థితి కనిపించడం లేదు.

ఎనిమిదో తరగతి చదివే 4,59,564మంది విద్యార్థులు, 59,176మంది ఉపాధ్యాయులకు సెప్టెంబరులో అందిస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. టెండర్ల ప్రక్రియలో జాప్యంతో నవంబరులో అందించాలని నిర్ణయం తీసుకుంది. నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా ట్యాబ్‌లు అందిస్తామని ఈనెల 16న శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ, చిప్స్‌ కొరత, కంటెంట్‌ అప్‌లోడ్‌ వంటి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో వీటిని అందించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ట్యాబ్‌ల సరఫరా గుత్తేదారుతో సెప్టెంబరు 5న ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 5,18,740 ట్యాబ్‌లను అందించేందుకు రూ.66.4కోట్లు వ్యయం కానుంది. 64జీబీ మెమరీ కార్డుతో కూడిన ఒక్కో ట్యాబ్‌ను 12,843కు సరఫరా చేసేందుకు గుత్తేదారుతో ఒప్పందం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని