జీవితం తలకిందులు!

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తేకుమంద గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ వయసు 38. 2015లో పొలంలోని చెట్టు ఎక్కగా.. పట్టుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో

Published : 25 Sep 2022 05:25 IST

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తేకుమంద గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ వయసు 38. 2015లో పొలంలోని చెట్టు ఎక్కగా.. పట్టుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయగా తల ఇలా అణిగిపోయింది. కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. 3 నెలల పాటు కోమాలో ఉన్నాడు. బతుకుతాడో లేదో.. బతికినా ప్రయోజనం లేదన్నారు. అయినా తల్లి గోవిందమ్మ అక్కడే ఉంటూ ఆయనను బతికించుకుంది. ఆసుపత్రి కోసం చేసిన అప్పులు చెల్లించమని ఒత్తిడి పెరగడంతో వారికున్న 2.5 ఎకరాల పొలం విక్రయించి అప్పులు తీర్చారు. దీంతో బంధువులు దూరమయ్యారు. పింఛను సొమ్ము ప్రతి నెల మాత్రలకే సరిపోతుందని, తనకు జీవనాధారం కల్పించాలని నాయకులు, అధికారులకు విన్నవించామని బాధితుడు చంద్రమోహన్‌ తల్లిదండ్రులు గోవిందమ్మ, క్రిష్ణయ్యలు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో కొన్ని డబ్బులు పోగేసుకుని ముఖ్యమంత్రికి తమ బాధను విన్నవించేందుకు విజయవాడ, కడపకు వెళ్లామని.. అక్కడి అధికారులు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని వారు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని