సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామక తుది జాబితా రద్దు

రాష్ట్ర ప్రజారోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టుల భర్తీకి ప్రకటించిన జాబితాను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రద్దు చేశారు. అందులో దొర్లిన తప్పులు సవరించి, మళ్లీ

Published : 25 Sep 2022 05:25 IST

సవరించిన జాబితాపై 26 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రజారోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టుల భర్తీకి ప్రకటించిన జాబితాను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రద్దు చేశారు. అందులో దొర్లిన తప్పులు సవరించి, మళ్లీ రివైజ్డ్‌ తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. దీనిపై అభ్యర్థుల నుంచి ఈనెల26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ పరిణామం వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. సీఏఎస్‌ రిక్రూట్‌మెంట్‌ (నోటిఫికేషన్‌ నంబరు-04/2022) ప్రకారం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారి మార్కుల మెమోలో పేర్కొన్న మెయిన్‌, లాంగ్వేజి సబ్జెక్టులు, స్టడీ అవర్స్‌, మార్కులు గుర్తించి ప్రాధాన్య క్రమంలో అభ్యర్థుల జాబితా తయారీలో తప్పులు జరిగినట్లు తెలిసింది. అలాగే ఒప్పంద విధానంలో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ యూనిట్స్‌లో పని చేసిన వారికి ప్రాధాన్య మార్కుల కేటాయింపు తీరును ప్రశ్నిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రివైజ్డ్‌ తుది జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీనిపై ఇప్పుడు అభ్యంతరాలను తీసుకుంటారు. తొలి జాబితాలో ఎంపికైన వారే దాదాపుగా దీనిలోనూ ఉన్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని