40 టన్నుల ‘ద్రవ ఉక్కు’ నేలపాలు

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం బ్లాస్ట్‌ఫర్నేస్‌-1లో 40 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. శనివారం ద్రవ ఉక్కును తరలించేందుకు రెండు టార్ఫిడో లాడిల్‌ కార్లు (టీఎల్‌సీ)

Updated : 25 Sep 2022 06:44 IST

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం బ్లాస్ట్‌ఫర్నేస్‌-1లో 40 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. శనివారం ద్రవ ఉక్కును తరలించేందుకు రెండు టార్ఫిడో లాడిల్‌ కార్లు (టీఎల్‌సీ) ట్రాక్‌పై ఉన్నాయి. ఒక టార్ఫిడో లాడిల్‌ కారులో ద్రవ ఉక్కు నిండిపోయిన తర్వాత.. వాల్వును మరో కారులోకి తిప్పాల్సి ఉండగా సాంకేతిక సమస్యతో అది తిరగలేదు. దీంతో సుమారు 40 టన్నుల ద్రవ ఉక్కు నేలమీద పడటంతో.. మంటలు చెలరేగి టీఎల్‌సీలకు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది కలిసి రెండు రైలు ఇంజిన్ల సాయంతో వాటిని బయటకు తీసి మరమ్మతులు ప్రారంభించారు. కొంత మేర ట్రాక్‌ దెబ్బతిన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని