రైతు సాధికార సంస్థకు జైవిక్‌ అవార్డు

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థకు జైవిక్‌ అవార్డు లభించింది. శుక్రవారం ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి

Published : 25 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థకు జైవిక్‌ అవార్డు లభించింది. శుక్రవారం ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌, కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ సలహాదారుడు, మణిపాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకే యాదవ్‌ అవార్డులు ప్రదానం చేశారు. రైతు సాధికార సంస్థ తరఫున ప్రభాకర్‌, నివేదిత అవార్డు తీసుకున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన నిట్టపుట్టు సంఘం నుంచి సీఈఓ గంగరాజు, పార్వతీపురం జిల్లాకు చెందిన మా భూమి తరఫున సీఈఓ నాయుడుతోపాటు వ్యక్తిగత విభాగంలో వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఓబులమ్మ పురస్కారాలను స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు