మొక్కలు పెరిగి.. బీటలు వారి..

ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలపై పిచ్చి మొక్కలు పెరిగి చెట్లుగా మారుతుండటంతో భవన గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని ధరణికోట ప్రాథమిక పాఠశాల

Published : 25 Sep 2022 05:25 IST

ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలపై పిచ్చి మొక్కలు పెరిగి చెట్లుగా మారుతుండటంతో భవన గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని ధరణికోట ప్రాథమిక పాఠశాల భవనం ముందు భాగంలోనూ ఇనుప చువ్వలు బయటపడి చినుకు పడినా పైకప్పు అంతా నీరు కారుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 55 మంది విద్యార్థులకు ఒక తరగతి గది ఉండటంతో వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎప్పుడు కూలుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు-నేడు పనులు త్వరగా మొదలుపెట్టాలని వారు కోరుతున్నారు.

- ఈనాడు పల్నాడు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని