ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం చారిత్రక తప్పిదం

విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. పేరు మార్పు నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా

Published : 25 Sep 2022 05:50 IST

ప్రవాసాంధ్రుల ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. పేరు మార్పు నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు జరుగుతున్న వేళ తెలుగువారందరినీ జగన్‌ అవమానపరిచారని ధ్వజమెత్తారు. అమెరికాలోని వాషింగ్‌టన్‌ డీసీ మెట్రో ప్రాంతంలో ఎన్టీఆర్‌ పేరు మార్పు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవాసాంధ్రులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ‘‘గతంలో తెదేపా ప్రభుత్వం కూడా ఇలాగే ఆలోచించి ఉంటే వైఎస్సార్‌ జ్ఞాపకాలు మిగిలేవి కావు’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, వీరనారాయణ, సీతారామారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని