ఐదుగురు తెలుగువారికి పురస్కారాలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు... జాతీయ సేవా పథకం అవార్డులు అందుకున్నారు. వీరిలో యూనివర్సిటీ కేటగిరీలో వరంగల్‌లోని

Published : 25 Sep 2022 05:50 IST

ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు... జాతీయ సేవా పథకం అవార్డులు అందుకున్నారు. వీరిలో యూనివర్సిటీ కేటగిరీలో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సుంకరి జ్యోతి జాతీయస్థాయిలో రెండో బహుమతి దక్కించుకున్నారు. ఈ అవార్డు కింద ఆమెకు రూ.3 లక్షల నగదు, వెండి పతకం బహూకరించారు. కార్యక్రమ నిర్వహణ/ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ల కేటగిరీలో అనంతపురం జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన కె.జితేందర్‌గౌడ్‌ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. రూ.లక్షన్నర నగదు, వెండిపతకం అందుకున్నారు. వాలంటీర్‌ కేటగిరీలో నెల్లూరు కృష్ణచైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురం శ్రీనివాస రామానుజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన సిరి దేవనపల్లి, హైదరాబాద్‌ శ్రేయాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన కుచురు మైసూరారెడ్డి... రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. వీరికి రూ.లక్ష చొప్పున నగదు, వెండి పతకాలు బహూకరించారు. అన్ని కేటగిరీల్లో 42 అవార్డులు ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు 5 దక్కాయి. రాష్ట్రపతి భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని