సర్పంచుల భిక్షాటన

పంచాయతీల నిధుల మళ్లింపును నిరసిస్తూ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జాతీయ రహదారిపై తెదేపా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు భిక్షాటన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం కూడలిలో ధర్నా చేసి,

Published : 26 Sep 2022 04:38 IST

సాలూరు, న్యూస్‌టుడే: పంచాయతీల నిధుల మళ్లింపును నిరసిస్తూ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జాతీయ రహదారిపై తెదేపా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు భిక్షాటన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం కూడలిలో ధర్నా చేసి, ప్రధాన రహదారిలోని దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ ఎన్టీఆర్‌ కూడలి వరకూ ర్యాలీ చేపట్టారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ.. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం లేకుండా పోతోందన్నారు. సాలూరు, పాచిపెంట, మండలాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పి.సంతోషి, జి.యుగంధర్‌, కె.సత్యవతి, ఎ.నళిని, రెడ్డి ఎర్రినాయుడు, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని