కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో కొండముచ్చుల సందడి!

అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలకు చేరి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కోతుల్ని భయపెట్టే కొండముచ్చులు(కొండెంగ) మాత్రం అడవుల్లోనే హాయిగా సంచరిస్తున్నాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో ఓ చెట్టుపై కూర్చుని ఊసులాడుకుంటున్న

Updated : 26 Sep 2022 05:36 IST

అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలకు చేరి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కోతుల్ని భయపెట్టే కొండముచ్చులు(కొండెంగ) మాత్రం అడవుల్లోనే హాయిగా సంచరిస్తున్నాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో ఓ చెట్టుపై కూర్చుని ఊసులాడుకుంటున్న కొండెంగల చిత్రాల్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తన కెమెరాలో బంధించారు. పొడవాటి వీటి తోకలు చెట్టు రంగులో కలిసిపోయి నేలను తాకుతున్నట్లు కనిపించాయి. మరో కొండముచ్చు చెట్టు వెనకాల దాక్కుని తొంగి చూస్తోంది. ఈ చిత్రాల్ని ఎంపీ సంతోష్‌ తన ట్విటర్‌ ఖాతాకు జతచేశారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని