అంకితభావంతోనే వృత్తిలో రాణింపు

న్యాయవాద వృత్తిలో రాణించాలంటే అంకితభావం అవసరమని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు సూచించారు. సీనియర్‌ న్యాయవాది వద్ద చేరి కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు.

Published : 26 Sep 2022 04:38 IST

జస్టిస్‌ గంగారావు

ఈనాడు, అమరావతి: న్యాయవాద వృత్తిలో రాణించాలంటే అంకితభావం అవసరమని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు సూచించారు. సీనియర్‌ న్యాయవాది వద్ద చేరి కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో కృషి చేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత శిఖరాలను చేరవచ్చని తెలిపారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఆదివారం హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన న్యాయవాదుల పేరు నమోదు కార్యక్రమానికి జస్టిస్‌ ఎం.గంగారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు చలసాని అజయ్‌ కుమార్‌, కె.చిదంబరం, న్యాయవాదులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts