‘మండల్‌-2’ గుంటూరు నుంచే ప్రారంభం కావాలి: బీసీ నాయకుల పిలుపు

మండల్‌-2 ఉద్యమం గుంటూరు నుంచే ప్రారంభం కావాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు. గుంటూరు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో బీపీ మండల్‌ మనవడు,

Published : 26 Sep 2022 04:38 IST

గుంటూరు (గోరంట్ల), న్యూస్‌టుడే: మండల్‌-2 ఉద్యమం గుంటూరు నుంచే ప్రారంభం కావాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు. గుంటూరు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో బీపీ మండల్‌ మనవడు, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరజ్‌ మండల్‌ మాట్లాడుతూ.. గుంటూరులో ఏర్పాటుచేసే విగ్రహం దేశానికి ఒక సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని సూచించారు. దిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ సందీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. దేశ జనాభాలో 60 శాతం మంది బీసీలుండగా, పార్లమెంటులో 20 శాతం మందే ఆ వర్గ ఎంపీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కార్యక్రమంలో మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, జనసేన పార్టీ గుంటూరు పార్లమెంటు ఇన్‌ఛార్జి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.శంకరరావు, బీపీ మండల్‌ విగ్రహ నిర్మాణ కమిటీ నిర్వాహకులు ఆలా వెంకటేశ్వర్లు, గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts