దుర్గగుడిలో నేటి నుంచి దసరా వేడుకలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 5 వరకు వేడుకలు కొనసాగుతాయి. కొవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లు పరిమిత భక్తుల మధ్య వేడుకలు జరిగాయి. ప్రస్తుతం కొవిడ్‌ నింబంధనలు

Published : 26 Sep 2022 04:38 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 5 వరకు వేడుకలు కొనసాగుతాయి. కొవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లు పరిమిత భక్తుల మధ్య వేడుకలు జరిగాయి. ప్రస్తుతం కొవిడ్‌ నింబంధనలు అమలులో లేనందున పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. 10 రోజుల్లో కనీసం 14 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేశారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి 3 కిలోమీటర్ల దూరం క్యూలైన్లను వేశారు. ఉత్సవాల వేళ ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అక్టోబరు 2న ఆదివారం మూలానక్షత్రం రోజు 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. శరన్నవరాత్రోత్సవాలు ముగిశాక అక్టోబరు 6, 7 తేదీలలో భవానీ భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని