ఉన్నతాధికారులు ఉయ్యాలో.. వరినాట్లతో మురిసిరి ఉయ్యాలో..

నిత్యం తీరిక లేకుండా గడిపే కలెక్టర్లు ఆదివారం వ్యవసాయ కూలీలుగా మారారు. అధికార హోదా పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. వ్యవసాయరంగంపై తమ మక్కువ చాటుకున్నారు

Updated : 26 Sep 2022 06:32 IST

బాపట్ల, న్యూస్‌టుడే: నిత్యం తీరిక లేకుండా గడిపే కలెక్టర్లు ఆదివారం వ్యవసాయ కూలీలుగా మారారు. అధికార హోదా పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. వ్యవసాయరంగంపై తమ మక్కువ చాటుకున్నారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్‌, దినేష్‌ కుమార్‌ దంపతులు.. తమ పిల్లలు కేవర్‌దేవి, సిద్ధార్థ ఆత్రేయ, బంధువులతో కలిసి ఆదివారం ఉదయం బాపట్ల మండలం మురుకుండపాడు పొలాల వద్దకు వచ్చారు. అక్కడ కూలీలతో కలిసి వారంతా పొలంలో మధ్యాహ్నం వరకు వరి నాట్లు వేశారు. అనంతరం వారు ఇంటి నుంచి తెచ్చుకున్న పప్పు, ఆవకాయ, పెరుగన్నం గట్టుపైనే కూర్చుని భోంచేశారు. కలెక్టర్లు విజయ కృష్ణన్‌, దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. యువత ఇష్టపడి వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. అన్నదాతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts