కొద్దిసేపు కూర్చోండి తల్లీ!

‘అమ్మా.. కొద్దిసేపు కూర్చోండి తల్లీ.. ఆ తరువాత వెళ్లిపోదురు..’ అంటూ అధికారులు బతిమిలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో సోమవారం

Updated : 27 Sep 2022 05:10 IST

చేయూత పంపిణీ కార్యక్రమంలో అధికారుల పాట్లు

కేవీబీపురం, న్యూస్‌టుడే: ‘అమ్మా.. కొద్దిసేపు కూర్చోండి తల్లీ.. ఆ తరువాత వెళ్లిపోదురు..’ అంటూ అధికారులు బతిమిలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో సోమవారం వైఎస్‌ఆర్‌ చేయూత మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిమూలం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి మండలం నలుమూలల నుంచి అర్హులైన లబ్ధిదారులను చేరవేసే పనిలో వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం అధికారులు.. వాలంటీర్ల ద్వారా చొరవ తీసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద తాగునీరు, నీడ లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎమ్మెల్యే ప్రసంగించక ముందే మహిళలు సభాప్రాంగణం నుంచి తిరుగుముఖం పట్టారు. వారిని వెళ్లనీయకుండా నియంత్రించేందుకు ప్రధాన ద్వారం వద్ద మూడు ద్విచక్రవాహనాలను వైకాపా శ్రేణులు అడ్డుపెట్టినా లెక్కచేయకుండా మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts