ఎయిమ్స్‌ విజ్ఞప్తులను పరిష్కరిస్తున్నాం

మంగళగిరి ఎయిమ్స్‌ అధికారుల నుంచి వచ్చిన విజ్ఞపులను వెంటనే పరిష్కరిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని వివరణ ఇచ్చారు. ‘ఎయిమ్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు’ అనే శీర్షికతో సోమవారం...

Published : 27 Sep 2022 03:59 IST

నీటి కొనుగోలు ఖర్చు మాదే: మంత్రి రజిని

ఈనాడు, అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌ అధికారుల నుంచి వచ్చిన విజ్ఞపులను వెంటనే పరిష్కరిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని వివరణ ఇచ్చారు. ‘ఎయిమ్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు’ అనే శీర్షికతో సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి రోజుకి మూడు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. అదనంగా మరో లక్ష లీటర్ల నీటిని రిజర్వులో ఉంచుతున్నాం. పెరిగిన సేవలకు తగ్గట్లు అదనంగా మరో మూడు లక్షల లీటర్ల నీటిని పంపిణీ చేయాలని ఎయిమ్స్‌ నుంచి విజ్ఞప్తి వచ్చింది. ఈ నీటిని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అందివ్వబోతున్నాం. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర వైద్యారోగ్య శాఖనే భరిస్తుంది. ఈఏడాది జూన్‌లో జారీ చేసిన రూ.7.74 కోట్ల ఆమోద ఉత్తర్వులతో నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఆత్మకూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి రోజుకు 25 లక్షల లీటర్ల నీటిని ఎయిమ్స్‌కు అందజేసేందుకు రివర్స్‌ టెండర్‌ ద్వారా టెండర్లు పిలిచాం. సంస్థ ఎంపిక జరిగింది. రూ.10 కోట్లతో ఎయిమ్స్‌ ప్రాంగణానికి వచ్చేందుకు రెండు మార్గాల్లో రోడ్డు సౌకర్యాన్ని కల్పించాం. మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం రూ.25 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుచేశాం’ అని ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు