విరగ్గాసిన వేరుసెనగ

వేరుసెనగ పంట నష్టాలతో ఒకవైపు రైతులు విరామం ప్రకటిస్తుండగా ఓ రైతు మాత్రం అత్యధిక దిగుబడి సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని.....

Published : 27 Sep 2022 03:59 IST

వేరుసెనగ పంట నష్టాలతో ఒకవైపు రైతులు విరామం ప్రకటిస్తుండగా ఓ రైతు మాత్రం అత్యధిక దిగుబడి సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని కాలువపల్లె పంచాయతీ బుద్దలవారిపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్‌రెడ్డి ఎకరా పొలంలో టీసీజీఎస్‌-1964 రకం వేరుసెనగను సాగు చేశారు. ఒక్కో మొక్కకు 200లకు పైగా కాయలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రూ.22 వేలు పెట్టుబడి పెట్టగా ప్రస్తుత ధరలను బట్టి మంచి ఆదాయం వస్తుందని రైతు చంద్రశేఖర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ రకం ఎక్కువగా పండిస్తారని ములకలచెరువు వ్యవసాయాధికారిణి లీలాకుమారి చెప్పారు. రెండు మొక్కలకు మధ్య అడుగు దూరం పాటించడం వల్ల ఒక్కోదానికి సుమారు 200కు పైగా కాయలు రావడానికి ఆస్కారం ఏర్పడిందని తెలిపారు.

-న్యూస్‌టుడే, ములకలచెరువు గ్రామీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని