108 వాహనం దిగబడి.. గర్భిణికి యాతన

పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లడానికి నిండు గర్భిణి 108 వాహనం కోసం నిరీక్షిస్తుండగా.. గ్రామానికి సరైన రహదారి లేక కాలువలో వాహనం ఇరుక్కుపోయింది.

Published : 27 Sep 2022 03:59 IST

గోరంట్ల, న్యూస్‌టుడే: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లడానికి నిండు గర్భిణి 108 వాహనం కోసం నిరీక్షిస్తుండగా.. గ్రామానికి సరైన రహదారి లేక కాలువలో వాహనం ఇరుక్కుపోయింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్పంచి నరసింహమూర్తి, గ్రామస్థుల వివరాల మేరకు.. వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబీకులు 108 వాహనానికి ఫోన్‌ చేయగా.. వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. జాతీయ రహదారి నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటరు దూరంలో గ్రామం ఉంది. గ్రామ సమీపానికి వచ్చిన వాహనం రోడ్డుపై కాలువలో ఇరుక్కుపోయింది. గ్రామస్థుల సహకారంతో సుమారు గంటపాటు కష్టపడి వాహనాన్ని బయటకు తీసి గర్భిణిని హిందూపురం తీసుకెళ్లారు. గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతున్నా పాలకుల నుంచి స్పందన లేదని, పాలకులు, అధికారులను అడిగి విసిగిపోయామని సర్పంచి వాపోయారు. తానే పలుమార్లు మట్టి తోలించానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని