శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభం

అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి

Updated : 27 Sep 2022 05:07 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, అర్చకులు, వేదపండితులు ఉత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని