వారికీ పదవీ విరమణ వయసు 62 ఏళ్లు చేస్తాం

‘సొసైటీలు, గురుకులాలు, వర్సిటీ బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు పెంపు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Published : 27 Sep 2022 03:59 IST

మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: ‘సొసైటీలు, గురుకులాలు, వర్సిటీ బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు పెంపు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. దానికనుగుణంగా వీరికి పదవీ విరమణ వయసు 62 ఏళ్లు చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే పురపాలక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అక్టోబరు నుంచి డీడీవో అధికారాలు ఇస్తామన్నారు. దీంతో జీతాలు, సెలవులు లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పురపాలక ఉపాధ్యాయుల సమస్యలపై విజయవాడలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పురపాలక ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయి. వేతనాలు, సెలవుల సమస్యను పరిష్కరించాం. మిగతా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పాం. విజయనగరంలో పైడితల్లి జాతర ఉంటుందని, దసరా సెలవుల్లో మార్పు చేయాలని అక్కడ వారు కోరారు. దసరా సెలవుల్లో పని చేస్తామని, ఆ తర్వాత నాలుగు రోజులు పొడిగించాలని కోరారు. విజయనగరం వరకు సెలవులకు ఆదేశాలు ఇస్తాం...’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని